- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుస్సాడి ఉత్సవాలకు గూడేనికి రూ. 50 వేలు ఇవ్వాలి.. కవిత డిమాండ్.. ట్యాంక్‌బండ్‌పై కొమురం భీమ్‌కు నివాళులు
తెలంగాణ మన్నెం పులి, ఆదివాసీ బొబ్బిలి కొమురం భీమ్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మన్నెం పులి, ఆదివాసీ బొబ్బిలి కొమురం భీమ్ (Komaram Bheem) అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla kavitha) అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆదివాసీ యోధుడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా కల్వకుంట్ల కవిత ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ జాతి కోసం ఎలా పోరాటం చేయాలో దేశం మొత్తం తరతరాలు చెప్పుకునేలా గొప్ప పోరాటం చేసిన బిడ్డ కొమురం భీమ్ అని హర్షం వ్యక్తం చేశారు. కొంత మంది జననం చరిత్ర అయితే.. కొంతమంది మరణం చరిత్ర అవుతుందని కొనియాడారు.
కొమురం భీమ్ తన మరణంతో ఆదివాసీలకు ఎన్నో హక్కులను పర్మినెంట్ గా సాధించి పెట్టారని అన్నారు. 'మావా నాటే మావా రాజ్' అంటే మా గూడెంలో మా రాజ్యమే ఉండాలన్న నినాదం ఆయన తీసుకొచ్చారని తెలిపారు. జల్, జంగల్, జమీన్ అనగా నీరు, అడవి, భూమి మీద ఆదివాసీలకే హక్కు ఉండాలన్న అంశాలతో ఆయన పోరాటం చేశారని వివరించారు. నిజాం ప్రభుత్వం తలలు వంచి ప్రజా సమస్యలపై దర్బార్ నిర్వహించే వారని గుర్తుకుచేశారు. ఇప్పటికిీ భీమ్ ఆశయాలను కొనసాగిస్తూ ఆదివాసీలు దర్బార్ నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ఇచ్చేటువంటి గౌరవం ఇచ్చామని అన్నారు.
జోడేఘాట్‌లో కొమురం భీమ్ సృతి వనం కట్టినట్లు తెలిపారు. ప్రతి నవంబర్ నెలలో గుస్సాడి ఉత్సవాలు మొదలు అవుతాయని, ఈ సందర్భంగా గతంలో ప్రతి గూడేనికి రూ.25 వేలు నిధులు ఇచ్చేవారని గుర్తుకు చేశారు. ప్రతి గూడేనికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఉత్సవాలు ఆదివాసీ సంస్కృతిని ముందుకు తీసుకుపోతాయని, కాబట్టి సంస్కృతి బతికించడం ప్రభుత్వాల బాధ్యత అని కవిత తెలిపారు.






