గ్రూపు-1 పరీక్ష రద్దు చేయాలని సీజేఐకి కవిత లేఖ

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-23 10:55:35  IST  )

గ్రూపు-1 పరీక్ష(Group-1 Exam)ను రద్దు చేయాలని రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) లేఖ రాశారు.

గ్రూపు-1 పరీక్ష రద్దు చేయాలని సీజేఐకి కవిత లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-1 పరీక్ష(Group-1 Exam)ను రద్దు చేయాలని రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) లేఖ రాశారు. గ్రూపు-1 నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. సుమోటో స్వీకరించి చర్యలు తీసుకోవాలని సీజేఐని కవిత కోరారు. కాగా, ఇటీవలే గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో 562 మందికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.

గ్రూపు-1 పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని.. ఈ విషయాన్ని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారని ఇప్పటికే కవిత తెలిపారు. ట్రాన్స్‌లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని, తద్వారా మార్కుల్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్ నంబరు, మెయిన్స్ కి మరొక హాల్ టికెట్ నంబరు కేటాయించడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రస్తావించారు.

Next Story