కల్వకుంట్ల కవిత, విశారదన్ మహరాజ్ అరెస్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-09 11:30:15  IST  )

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు.

కల్వకుంట్ల కవిత, విశారదన్ మహరాజ్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బాధితులతో కలిసి నిరసన చేస్తున్న ఆమెను, ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వారిని ప్రత్యేక వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న కవిత, విశారదన్ మహరాజ్‌ను అరెస్ట్ చేయడంపై ఆందోళన మరింత ఉధృతమైంది.

అంతకుముందు ఆమె మాట్లాడారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని కవిత పేర్కొన్నారు. ఇప్పటివరకూ బాధితులకు ప్రభుత్వం అండగా లేదని విమర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి వైద్య సహాయం కూడా అందలేదన్నారు. అనంతరం ఖమ్మం జడ్పీ కూడలిలో కవిత ఆందోళనకు దిగారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు. బాధితులతో కలిసి జడ్పీ కూడలిలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Next Story