ఈఎస్ఐ హాస్పిటల్‌లో ప్రమాదం.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్

by Ramesh Naini |

సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ రెనోవేషన్ పనులు చేస్తుండగా సెంట్రింగ్ కూలి కార్మికులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈఎస్ఐ హాస్పిటల్‌లో ప్రమాదం.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సనత్ నగర్ (ESI Hospital) ఈఎస్ఐ హాస్పిటల్ రెనోవేషన్ పనులు చేస్తుండగా సెంట్రింగ్ కూలి కార్మికులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం ఎక్స్ వేదిగా ఒక ప్రకటన విడుదల చేశారు. హాస్పిటల్ మరమ్మతు పనులు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ముగ్గురి మరణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు. కాగా, హైదరాబాద్ సనత్‌నగర్‌లో ని ESI ఆస్పత్రిలో సోమవారం బిల్డింగ్ రెనోవేషన్ వర్క్ చేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడున్న ముగ్గురు కార్మికులపై స్లాబ్ పెచ్చులు పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. అలాగే మరికొందరు గాయపడ్డారని, వెంటనే వారిని హాస్పిటల్‌లోకి తరలించి, చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ట్వీట్ ఇదే..

Next Story