20 ఏళ్లుగా కేసీఆర్ కోసం పనిచేశా.. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా : కవిత హాట్ కామెంట్స్

by Ramesh Naini |

‘20 ఏళ్లుగా కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా.. ఇంటి గుట్టు బయట పెట్టి.. కుట్ర చేసి నన్ను బయటకు పంపించారు.. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా’ అని కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు.

20 ఏళ్లుగా కేసీఆర్ కోసం పనిచేశా.. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా : కవిత హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘20 ఏళ్లుగా కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా.. ఇంటి గుట్టు బయట పెట్టి.. కుట్ర చేసి నన్ను బయటకు పంపించారు.. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా.. ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) హాట్ కామెంట్స్ చేశారు. శనివారం నిజామాబాద్ (Nizamabad) తెలంగాణ జాగృతి కార్యాలయంలో (Jagruti Janam Bata) "జాగృతి జనం బాట" ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. నిజామాబాద్‌లో నా ఓటమి ఓ కుట్రనా? కాదా? అని ప్రశ్నించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని ఆమె సూచించారు. గత 5 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా నిజామాబాద్ రాలేకపోయానని, ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి రావటం సంతోషంగా ఉందన్నారు. నేను నిజామాబాద్ కోడలిని, ఇది నా గడ్డ, ఎప్పటికైనా ఈ గడ్డలోనే కలిసిపోతాతని అన్నారు.

దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్న సరే నా మనసు ఈ గడ్డపైకి కొట్టుకుంటుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ ఈ జిల్లాలోని కందకూరులో పుట్టారని గుర్తుకుచేశారు. ఇంకో పక్క మనాల అడవుల్లో ఎన్ కౌంటర్లు జరిగినటువంటి చరిత్ర ఉందని, ఆర్ఎస్‌యూ, నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అందరికీ మద్దతు ఇచ్చిన చరిత్ర మన జిల్లాది అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మొట్టమొదటి సారి నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ గెలిచారని, అప్పటి నుంచే ఉద్యమం ఊపందుకుందని గుర్తుకు చేశారు. మీ బిడ్డను కాబట్టి నన్ను ఇక్కడి నుంచి పార్లమెంట్‌కు పంపించారని, మీ మర్యాద, గౌరవం కాపాడే విధంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నానని చెప్పుకొచ్చారు.

‘నేను 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఉద్యమంలోకి వచ్చా, గత 20 ఏళ్లుగా తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా, మీ కోడలిగా, బిడ్డగా నాకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సహనంతో ఎదురు చూశాను, నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలే, కానీ నన్ను కుట్ర చేసిన పంపించారు, నిజామాబాద్‌లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని కోరుతున్నా, నిజామాబాద్‌లో నా ఓటమి కుట్రనా కాదా ఆలోచించాలని అడుగుతున్నా, ఇక్కడ ఏం కుట్ర జరిగిందో చిన్న పిల్లలను అడిగిన సరే చెబుతారు, ఎన్ని అవమానాలు జరిగినా సరే నాన్న, బీఆర్ఎస్ మీద ప్రేమతో భరించా, కానీ ఇంటి గుట్టు బయటపెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను పార్టీ నుంచి పంపించారు, ఈ సమయంలో మీ ఆశీర్వాదం కావాలని మీ ముందుకు వచ్చా, మన అక్కా చెల్లెలు ప్రతి విషయంలో కష్టపడుతాం, కానీ ఒక్క ప్రభుత్వం కూడా మనకు ఏమీ చేయదు, గత 10 ఏళ్లలో మనం కొంత సాధించుకున్నాం. కానీ అమర వీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదు. ప్రతి అమర వీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే వరకు ఉద్యమం చేస్తాం. బీఆర్ఎస్ నన్ను కుట్ర చేసి పంపించటంతో నా దారి నేను వెతుకుతున్నా. ఇన్నాళ్లు కేసీఆర్ నీడలో ఉన్నా. ఇప్పుడు ఆ నీడలోంచి నన్ను బయట పడేశారు. అందుకే మీరు ఆశీర్వదిస్తారని మీ కోసం వచ్చా. మీరు అండగా ఉంటారని నమ్ముతున్నా’ అని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story