- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెగటు రాజకీయాలతోనే బీఆర్ఎస్ అధికారం పోయింది.. కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు
వెగటు రాజకీయాలు చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : వెగటు రాజకీయాలు చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం జాగృతి భవన్‌లో సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించారు. భోగ్ బండార్ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. తాము ఒక్క మున్సిపాలిటీ గెలిస్తే కాంగ్రెస్ ఆ సీటును లాక్కున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో అడిగేవాళ్లు, ప్రతిపక్షం ఉండొద్దా..? అని ప్రశ్నించారు. ఇట్ల ప్రతిపక్షాలు ఉండకుండా చేసే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. ఏ పార్టీలో గెలిచినా బీఆర్ఎస్‌లోకి చేర్చుకొని వెగటు పుట్టేలా చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేస్తున్నదని.. ప్రతిపక్షాలను, అడిగే వారిని ఉండనివ్వాలని అన్నారు. కాంగ్రెస్‌కు సైతం కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సేవాలాల్ ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదని.. సంఘ సంస్కర్త కూడా అని తెలిపారు. బంజారాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసిందని.. బంజారాలకు, ఆదివాసీలకు ఈ సీఎం లొల్లి పెట్టిస్తున్నారని ఆరోపించారు.
జీవో 33 ప్రకారం బంజారాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సేవాలాల్ సందేశం ప్రకారం జాగృతి ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. గోర్ భోళి భాషను 8వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు. పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రత్యేక కార్యాచరణతో ప్రత్యేక ఫండ్ కేటాయించాలన్నారు. బంజారాలు మంచి పొజిషనల్‌లో ఉండాలని.. రాజకీయాల్లో వారి రిప్రజెంటేషన్ ఉండాలని సూచించారు. యువ మిత్రులు తండాల్లో వెలుగులు నింపేలా నాయకత్వం చేపట్టాలని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వారు పోటీ చేయాలని పిలుపునిచ్చారు. లీడర్ షిప్ కావాలనుకునే యువత గ్రామాల్లో ఉండాలని అన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసుకున్నప్పటికీ సరైన వసతులు లేవని.. ఈ పరిస్థితి మారాలంటే సీఎం ప్రతీ తండాకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తండాల్లో రేషన్ షాప్‌లు, గ్రామపంచాయతీ, అంగన్ వాడీలు కట్టాలన్నారు. నల్కొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్‌లో ఐటీడీఏలు పెట్టాలన్నారు.






