- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SPB విగ్రహానికి వేరే ప్లేస్ చూసుకోండి : కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయనున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ వివాదం కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయనున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ వివాదం కొనసాగుతోంది. తెలంగాణ వాదులంతా రవీంద్ర భారతిలో SPB విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదని మండిపడుతున్నారు. అయితే బాలు విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడంపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రాన్ని ఊపేసిన "జయ జయహే తెలంగాణ.." గీతం పాడమంటే బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారు. అందుకే ఆయన విగ్రహం రవీంద్ర భారతి వంటి తెలంగాణ సాంస్కృతిక వేదికపై పెట్టడాన్ని తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తున్నారు.
తాను కూడా తెలంగాణ వాదులకే సపోర్ట్ చేస్తున్నానని ప్రకటించారు. SPB విగ్రహం పెట్టుకోడానికి ఇంకేదైనా ప్లేస్ చూసుకోవడం మంచిదని నిర్వాహకులకు కవిత సూచించారు. రవీంద్ర భారతిలో కేవలం తెలంగాణ కళాకారుల విగ్రహాలు మాత్రమే పెట్టాలని కల్వకుంట్ల కవిత స్పష్టం చేసారు. అయితే ఈనెల 15న బాలు విగ్రహవిష్కరణ కార్యక్రమం ఉండటంతో.. ప్రస్తుతం ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది.






