- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.. కవిత హాట్ కామెంట్స్
మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు ఏ ఓట్లు కూడా లేవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు ఏ ఓట్లు కూడా లేవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ (గురువారం) యాకుత్‌పురా హనుమాన్ నగర్ ముంపు ప్రాంత ప్రజలతో కవిత సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఏ పార్టీ అధికారంలో ఉన్న సరే మనకు డెవలప్మెంట్ కావాలని తెలిపారు. గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుంటే మేము సిటీలో తిరుగుతున్నామని అన్నారు. బలంగా నిలదీసి అడిగితే మనకు పనులు అవుతాయని చెప్పారు. అందుకే జాగృతి తరఫున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడుగుతున్నామని చెప్పుకొచ్చారు. దీంతో అధికారులు కూడా స్పందించి పనిచేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
ఇక ఓల్డ్ సిటీలో ఏ రోడ్డు చూసినా పన్నెండేళ్ల క్రితం వేసినవే ఉన్నాయన్నారు. మోరీలు, డ్రైనేజీ సిస్టం 35 ఏళ్ల కిందిది అట్లాగే ఉందని, సిటిలో అందరికీ సమానమైన అభివృద్ధి కావాలని డిమాండ్ చేశారు. ఇక్కడ చాలా దగ్గర పనుల కోసం డబ్బులు సాంక్షన్ అయ్యాయని చెబుతున్నారు.. కాని పనులు మాత్రం పూర్తి కాలేదన్నారు. హైదరాబాద్ సిటీకి రూ. 5 వేల కోట్లు బడ్జెట్ కేటాయించారు.. అందులో ఓల్డ్ సిటీ వాటా ఎంతో చెప్పడం లేదన్నారు. మనది గోల్డ్ సిటీ, ఒరిజినల్ సిటీ ఇక్కడ నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. నేను అన్ని పార్టీలను ప్రజల మధ్యకు రావాలని, అప్పుడు మాత్రమే మనకు వారి సమస్యలు అర్థమవుతాయన్నారు.






