- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాడుతాం.. తెలంగాణ జాగృతిలో 350 మంది అనుచరులతో బీసీ నేత చేరిక
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్‌కు చెందిన బీసీ నాయకుడు రామ్ కోటి 350 మంది అనుచరులతో కలిసి శుక్రవారం తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాగృతి అంటేనే పోరాటాల జెండా అని.. జాగృతి అంటేనే విప్లవాల జెండా అని అన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతామని తేల్చిచెప్పారు. జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుందని.. అదే సమయంలో పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుందన్నారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన గర్భిణులకు కేసీఆర్ కిట్‌తోపాటు ఆర్థిక సాయం అందించేవారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది బంద్ అయ్యిందన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు వారికి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని కొట్లాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల సాధనపై సమాలోచనలు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం కవిత బీసీ నాయకులు, యూపీఎఫ్ నాయకులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, జీవో 9 పై హైకోర్టు స్టే, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గెజిట్ జారీ చేయడం సహా పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో బీసీ నాయకులు లేవనెత్తిన వివిధ అంశాలపైనా డిస్కస్ చేశారు. అందరి అభిప్రాయాల మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయానికి వచ్చారు.
పేదింటి విద్యార్థిని చదువుకు అండ
పేదింటి విశ్వకర్మ కార్మిక కుటుంబానికి తెలంగాణ జాగృతి అండగా నిలిచింది. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన శామీర్‌పేట నరేంద్రాచారి, స్వప్న దంపతుల కుమార్తె ఆశ్రిత మల్లారెడ్డి టెక్నికల్ క్యాంపస్‌లో ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించింది. నరేంద్రాచారి హఠాన్మరణం పాలవడంతో బిడ్డ చదువు అగమ్యగోచరంగా మారింది. విద్యార్థిని తల్లి స్వప్నకు కుమార్తె కాలేజీ ఫీజు చెల్లించడం భారంగా మారింది. కవిత మొదటి సంవత్సరం ఫీజు మొత్తాన్ని శుక్రవారం ఆశ్రిత, ఆమె తల్లి స్వప్నకు అందజేశారు.






