ఫోన్ లిఫ్ట్ చేసి హలో కాదు... జై తెలంగాణ అనాలి - కవిత

by velandi.Saikiran |

ఫోన్ లిఫ్ట్ చేసి.. హలో అనే బదులు జై తెలంగాణ ( Jai Telangana) అని అనాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha

ఫోన్ లిఫ్ట్ చేసి హలో కాదు...  జై తెలంగాణ అనాలి - కవిత
X

దిశ, వెబ్ డెస్క్: ఫోన్ లిఫ్ట్ చేసి.. హలో అనే బదులు జై తెలంగాణ ( Jai Telangana) అని అనాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ( Telangana Jagruti Office)... కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఒకప్పుడు తెలుగు సినిమాలలో.. తెలంగాణ భాష యాస అంటే అవహేళనగా చూసేవారని ఫైర్ అయ్యారు. కానీ ఇప్పుడు తెలంగాణ భాష యాస లేకుండా సినిమా అసలు హిట్ కావడం లేదని సెటైర్లు పేల్చారు.

అంతలా తెలంగాణ భాష జనాల్లోకి వెళ్లిందని వివరించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Chief Minister Revanth Reddy)... జై తెలంగాణ అన్న నినాదం చేయలేకపోతున్నాడని నిప్పులు చెరిగారు. కానీ కేసీఆర్ ( KCR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. పరిస్థితి వేరేలా ఉండేదని వివరించారు. కేసీఆర్ ప్రతి మాట తెలంగాణ యాసలోనే వస్తుందని చెప్పుకొచ్చారు.

రానున్న బోనాల పండుగ ( Bonalu) సందర్భంగా ప్రతి బోనం మీద జై తెలంగాణ ( Jai Telangana) నినాదం రాయాలని పిలుపునిచ్చారు కల్వకుంట్ల కవిత. అలాగే ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు.. హలో అనే బదులు జై తెలంగాణ అనాలని వివరించారు. ఆర్టీసీ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. లేకపోతే బస్ భవన్ ముట్టడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత.

Next Story