రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరు : కవిత

by Muthe.Rajitha |

సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరని జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరు : కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరని జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కాగా 'జన బాట' కార్యక్రమంలో భాగంగా నేడు కవిత మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగం అయినా కరివెన రిజర్వాయర్ ను ఆమె పరిశీలించారు. కేసీఆర్ హయాంలో కరివెన ప్రాజెక్టు 80% పూర్తయ్యిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. పాలమూరు ప్రజలు రేవంత్ ను ఎన్నటికీ క్షమించబోరని కవిత ఫైర్ అయ్యారు.

Next Story