- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలింగ్ వేళ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న కాళోజీ కవిత
by Bhoopathi Nagaiah |
రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,655 సెంటర్లలో పోలింగ్ నడుస్తోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,655 సెంటర్లలో పోలింగ్ నడుస్తోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. గత నెల రోజులుగా పోలింగ్‌పై అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఓటర్లకు అవగాహన కల్పించారు. కొత్త ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యం చేశారు. కాగా, ఈ సమయంలో ప్రజాకవి, రచయిత కాళోజీ నారాయణ రావు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఓటు హక్కుపై రాసిన ‘‘ఓటిచ్చినప్పుడే ఉండాలి బుద్ధి..’’ కవిత ట్రెండ్ అవుతోంది.
ఓటిచ్చినప్పుడే ఉండాలి బుద్ధి..
ఎన్నుకోని తలబాదుకోన్ని నేమగును?
తర్వాత ఏడ్చినను తప్పదనుభవము..
అర్థం : ఓటు వేసే ముందు ఆలోచించి వేయండి. ఓటు వేశాక బాధపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
Next Story






