కాళోజీ యూనివర్సిటీ VC నందకుమార్ రాజీనామా

by Gantepaka Srikanth |

కాళోజీ యూనివర్సిటీ VC నందకుమార్ రాజీనామా

కాళోజీ యూనివర్సిటీ VC నందకుమార్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ(Kaloji University) వైస్ చాన్స్‌లర్ నందకుమార్ రాజీనామా(VC Nandakumar Resigns) చేశారు. పేపర్ల మూల్యాంకనంలో అవకవతకలతో పాటు ఇన్‌చార్జీల నియామకంలో ఆరోపణలు రావడంతో శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. కాగా, కాసేపటి క్రితమే కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై పత్రికల్లో వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. అవకతవకలపై ఆరా తీశారు. ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి వివరణ కోరారు. ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్థ పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించే సమస్యే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో అనూహ్యంగా వీసీ నందకుమార్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

Next Story