మాట‌ల తూటాలు కురిపించిన కాళోజీ.. రేర్ వీడియో వైర‌ల్!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-09 04:29:38  IST  )

తెలంగాణ తొలిపొద్దు కాళోజీ నారాయణ రావు జ‌యంతి నేడు. తెలంగాణపై ఎన్నో అద్భుత‌మైన క‌విత‌లు, ర‌చ‌న‌లు చేసి కాళోజీ స‌మాజాన్ని చైత‌న్యం చేశారు. ప్ర‌జ‌ల గొడ‌వ‌ను త‌న గొడ‌వ‌గా భావించి అక్ష‌రాల‌తోనే పోరాటం చేశారు.

మాట‌ల తూటాలు కురిపించిన కాళోజీ.. రేర్ వీడియో వైర‌ల్!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ తొలిపొద్దు కాళోజీ నారాయణ రావు జ‌యంతి నేడు. తెలంగాణపై ఎన్నో అద్భుత‌మైన క‌విత‌లు, ర‌చ‌న‌లు చేసి కాళోజీ స‌మాజాన్ని చైత‌న్యం చేశారు. ప్ర‌జ‌ల గొడ‌వ‌ను త‌న గొడ‌వ‌గా భావించి అక్ష‌రాల‌తోనే పోరాటం చేశారు. జ‌యంతి సంద‌ర్భంగా రాజ‌కీయనాయకులు, తెలంగాణ స‌మాజం ఆయ‌న‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో కాళోజీ మాట్లాడిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వీడియోలో కాళోజీ మాట‌ల తూటాలు కురిపించారు. "లా లో మోసం చేయ‌డం అనే ఒక సెక్ష‌న్ ఉంది. మోసం చేయ‌డానికి ముందు న‌మ్మ‌కం పెంచుకోవ‌డ‌మే దాని మొద‌టి క్రైటీరియా.. మోసం చేయాల‌నుకున్నోడు మొద‌ట న‌మ్మిస్తాడు. న‌మ్మించ‌కుండా మోసం చేయ‌డం అనేది జ‌ర‌గ‌దు. దొంగ‌లించ‌డం కావ‌చ్చు..అత్యాచారం కావ‌చ్చు ఇంకేదైనా కావ‌చ్చు. కానీ స‌మాజం న‌మ్మినోడిని మోసం చేయ‌వ‌ద్ద‌ని అంటుంది. మ‌రి న‌మ్మ‌క‌పోతే ఎలా చెడ‌గొడ‌తారు. చెడ‌గొట్టాలంటే ముందు న‌మ్మించాలి. మ‌నం చెప్పే ఫిలాస‌ఫీకి, మ‌న ప్రాక్టిక‌ల్ లైఫ్‌కు చాలా తేడా ఉంద‌న్నమాట‌.

కానీ స‌మాజానికి అంతా తెలుసు..ఎప్పుడైనా ఏ కాలంలో అయినా స‌మాజానికి మొత్తం తెలుసు. అపాయం ఎక్క‌డైనా ఉందంటే నేను దాని ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఎదురు ప‌డ‌ను, కానీ అపాయ‌మే నాపైకి వ‌స్తే అక్క‌డ నుండి పారిపోతా. అక్క‌డ కూడా నా ప్రొద్భ‌లం లేదు.. అది సాధార‌ణంగానే జ‌రిగిపోతుంది." అంటూ మాట్లాడారు. ఎంతో హుందాగా, న‌వ్వులు క‌ఠినమైన వాస్త‌వాల‌ను కాళోజీ చెబుతుంటే ప‌క్క‌న ఉన్న‌వారు ఆయ‌న్నే చూస్తుండిపోయారు. వీడియో వైర‌ల్ అవ్వ‌గా నెటిజ‌న్లు సైతం ఆయ‌న మాట‌లు విని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. video

Next Story