- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్ష రద్దు
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ పరిధిలో నిన్న (బుధవారం) జరిగిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షను అధికారులు రద్దు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ పరిధిలో నిన్న (బుధవారం) జరిగిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షను అధికారులు రద్దు చేశారు. ప్రశ్నాపత్రం రూపకల్పనలో జరిగిన సాంకేతిక పొరపాట్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. నిన్న జరిగిన జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షలో అధికారులు ఊహించని పొరపాటు చేశారు. వాస్తవానికి పేపర్-2కు సంబంధించిన సిలబస్ ప్రశ్నలు, పేపర్-1లో రావడంతో విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన అభ్యర్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, ప్రాథమిక విచారణ అనంతరం పరీక్షను రద్దు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది.
ఈనెల 27న రీ-ఎగ్జామ్..
రద్దు చేసిన జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను తిరిగి ఈనెల 27వ తేదీన (ఏప్రిల్ 27, 2026) నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ మార్పును గమనించి, ఆ రోజున పరీక్షకు హాజరుకావాలని కోరారు. ప్రశ్నాపత్రాల తయారీలో ఇలాంటి పొరపాట్లు జరగడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.






