- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంవోకు చేరిన కాళేశ్వరం నివేదిక.. సీఎం రేవంత్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ!
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ (Kaleshwaram Lift Irrigation)కు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పి.చంద్రఘోష్ కమిషన్ గురువారం ప్రభుత్వానికి సమర్పించింది.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ (Kaleshwaram Lift Irrigation)కు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పి.చంద్రఘోష్ కమిషన్ గురువారం ప్రభుత్వానికి సమర్పించింది. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు 650 పేజీలకు పైగా రిపోర్టును సీల్డ్ కవర్‌లో అందజేసింది. 2024 మార్చి 14న కమిషన్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలపై 119 మందిని విచారించి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసింది. ఈ నేపథ్యంలో కమిషన్ ఇచ్చిన నివేదిక ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. దీంతో ఆ రిపోర్టుపై ఉన్నతాధికారులు అధ్యయనం చేయనున్నారు. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పి.చంద్రఘోష్‌లు భేటీ కానుండటం ప్రాధ్యానతను సంతరించుకుంది.






