- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరం పుష్కరాలపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు(Kaleshwaram Saraswati Pushkaralu) విజయవంతం కావడంపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు(Kaleshwaram Saraswati Pushkaralu) విజయవంతం కావడంపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. సరస్వతీ పుష్కరాలు విజయవంతం కావటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి పుష్కరాలు అద్భుతంగా జరిగాయి. 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఇందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు, స్థానిక ప్రజలకు, భక్తులకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో వచ్చే గోదావరి పుష్కరాలను మరింతగా గొప్పగా జరుపుకుందాం. ఈ పుష్కరాలు విజయవంతం కావటంలో కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక అధికారులు, ఎండోమెంట్ డిపార్టుమెంటు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ మంత్రి కొండా సురేఖ ప్రకటన విడుదల చేశారు.
కాగా, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సరస్వతీ పుష్కరాలు మంగళవారం ప్రశాంతంగా ముగిశారు. పదకొండు రోజుల పాటు నిర్వహించిన ఈ పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పుష్కర ఘాట్లు కిక్కిరిసిపోయాయి. పుష్కరాల మొదటి రోజున లక్షా మంది భక్తులు హాజరైతే, చివరి రోజున మాత్రం 3.7 లక్షల మంది యాత్రికులు పుణ్యస్నానాలు చేశారు. పుష్కరాలు నిర్వహించిన 11 రోజుల్లో మొత్తం 23.1 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు, పూజులు నిర్వహించారు. వీరంతా రాష్ట్రం నుంచే కాకుండా సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.






