- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: కాళేశ్వరం పుష్కరాల హుండీ లెక్కింపు పూర్తి.. 12 రోజుల ఆదాయం ఎంతొచ్చిందో తెలుసా?
వైభవంగా 12 రోజుల పాటు సాగిన సరస్వతి నది పుష్కరాలు(Kaleshwaram Pushkaralu) గత సోమవారం ముగిశాయి.

దిశ, వెబ్‌డెస్క్: వైభవంగా 12 రోజుల పాటు సాగిన సరస్వతి నది పుష్కరాలు(Kaleshwaram Pushkaralu) గత సోమవారం ముగిశాయి. ఈనెల 15న ఉదయం ప్రారంభమైన పుష్కరాలు సోమవారం 12వ రోజున సాయంత్రం 4 గంటలకు ముగిశాయి. 12 రోజుల పాటు భక్తుల పుణ్యస్నానాలు..ఆధ్యాత్మికతతో త్రివేణి సంగమం పులకించిపోయింది. నిత్యం వేలాది మంది భక్తుల దర్శనాలతో.. ప్రత్యేక పూజలతో కాళేశ్వరం ముక్తీశ్వరుడి ఆలయం మారు మోగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సామాన్య భక్తులు, వీఐపీలు, స్వాములు, పీఠాధిపతులతో 12 రోజులు సందడి నెలకొంది. సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొలి మూడు రోజుల్లో వేలల్లో, ఆ తర్వాత నాలుగు రోజు నుంచి ప్రతీ రోజూ లక్షకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా అనేకమంది ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. తాజాగా కాళేశ్వరం పుష్కరాల హుండీ లెక్కింపును అధికారులు పూర్తి చేశారు. వరంగల్ సహాయ కమిషనర్ సునీత సమక్షంలో లెక్కించారు. మొత్తం 12 రోజులకు గాను రూ.2.83 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఒక్క ఈ పుష్కరాల కారణంగా ఆర్టీసీకి 12 రోజుల వ్యవధిలో సుమారు రూ.8 కోట్ల ఆదాయం లభించింది.






