- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kaleshwaram Commission: కొనసాగుతోన్న కాళేశ్వరం కమిషన్ విచారణ.. హాజరైన ప్రస్తుత ఈఎన్‌సీ
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో భాగమైన మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram), సుందిళ్ల (Sundilla) బ్యారేజీ నిర్మాణాల్లో అవకతవకలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణను పొడిగించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో భాగమైన మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram), సుందిళ్ల (Sundilla) బ్యారేజీ నిర్మాణాల్లో అవకతవకలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ గడువును ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లోని బీఆర్‌కే భవన్ (BRK Bhavan)లో ఉన్న కమిషన్ కార్యాలయంలో బహిరంగ విచారణ పున: ప్రారంభమైంది. నేటి విచారణకు గజ్వేల్ ఈఎన్‌సీ హరిరాం (Hariram)తో పాటు మాజీ ఈఎన్‌సీ (జనరల్) మురళీధర్ (Muralidhar), కాళేశ్వరం మాజీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు (Venkateshwarlu), మాజీ ఈఎన్‌సీ (సీడీవో) నరేందర్ రెడ్డి (Narender Reddy) హాజరయ్యారు. ఇప్పటికే వారంతా కమిషన్ ఎదుట బహిరంగ విచారణకు హాజరై కమిషన్ అడిగిన ప్రశ్నలకు తమ స్టేట్‌మెంట్‌తో పాటు అఫిడవిట్లు (Affidavits) కూడా సమర్పించారు. అయితే, అనూహ్యంగా అఫిడవిట్, విచారణలో చెప్పిన విషయాలకు ఎక్కడ పొంతన లేనట్లుగా కమిషన్ సభ్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారిని మరోసారి విచారించాలంటూ కమిషన్ వారిని విచారణకు రావాలంటూ సమాచారం అందజేసింది. దీంతో ఈఎన్‌సీ (ENC's)లు మరోసారి బహిరంగ విచారణకు హాజరయ్యారు.
కాగా, కాళేశ్వరం కమిషన్ (Kaleswaram Commission) ఇప్పటి వరకు 109 మందిని విచారించింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీర్లు, సీసీ డిజైన్లు (CC Designs), ఓఅండ్‌ఎం ఇంజినీర్లు (O & M Engineers), నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు సమర్పించిన అఫిడవిట్లపై బహిరంగ విచారణ పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో పని చేసిన ఇంజినీర్లు, ఇరిగేషన్‌శాఖకు సంబంధించి పూర్వ, ప్రస్తుత సెక్రటరీలు, కమిషన్ ఎదుట అఫిడవిట్లు దాఖలు చేసిన రిటైర్డ్ ఇంజినీర్లు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసింది. మొత్తం 400 పేజీలతో నివేదికను సిద్ధం చేసినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.






