KCR : కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. కేసీఆర్-హరీష్ రావు భేటీ

by Muthe.Rajitha |

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(MLA Harish Rao) బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్(BRS Cheif KCR) ను ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌లో కలిశారు.

KCR : కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. కేసీఆర్-హరీష్ రావు భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(MLA Harish Rao) బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్(BRS Cheif KCR) ను ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌లో కలిశారు. వీరి ఇద్దరి మధ్య సుమారు గంటపాటు చర్చలు నడిచినట్టు సమాచారం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌(Kaleshwaram Lift Irrigation Project)కు సంబంధించి జస్టిస్ చంద్రఘోస్ కమిషన్(Justice Chandra Ghose Commission) జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో ఈ సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి కుంగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ చంద్రఘోస్ కమిషన్ ను నియమించిన సంగతి తెలిసిందే. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG) ఇచ్చిన నివేదికలో బయటపడిన ఆర్థిక అవకతవకలు, అధిక ఖర్చు, లోపభూయిష్ట ప్లానింగ్‌ పై ముఖాముఖి వివరణ ఇవ్వాల్సిందిగా ఈ నోటీసులు జారీ అయ్యాయి.

ఈ సందర్భంగా కమిషన్ ముందు విచారణకు హాజరు కావడం, చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడం వంటి అంశాలు కేసీఆర్-హరీష్ రావు మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి జస్టిస్ చంద్రఘోస్ కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

Next Story