దగ్గర పడుతోన్న కాళేశ్వరం కమిషన్ విచారణ.. మరోసారి మామఅల్లుడి భేటీ

by Kema Shiva Kumar |

మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఇవాళ మరోసారి గులాబీ బాస్‌తో భేటీ అయ్యారు.

దగ్గర పడుతోన్న కాళేశ్వరం కమిషన్ విచారణ.. మరోసారి మామఅల్లుడి భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఇవాళ మరోసారి గులాబీ బాస్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన కాసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నారు. ఇటీవలే జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) జూన్ 5న కేసీఆర్‌ (KCR)ను, జూన్ 9న హరీశ్ రావును విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ విచారణ హాజరవుతారా.. అన్న దానిపై స్పష్టత లేనప్పటికీ వారిద్దరూ కాళేశ్వరం కమిషన్‌ సభ్యులు ప్రశ్నించే అంశాలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, తేదీ ప్రకారం మొదట విచారణకు కేసీఆర్ హాజరుకావాల్సి ఉండగా కమిషన్ సభ్యులు అడిగే ప్రశ్నలపై ఇప్పటికే ఆయన ఫుల్‌గా ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టులపై కింద సాగు అవుతున్న భూములు, విస్తీర్ణం తదితర అంశాలను నివేదిక రూపంలో హరీశ్‌తో కలిసి సిద్ధం చేయబోతున్నట్లుగా సమాచారం. అదేవిధంగా తాజాగా మీడియా ఎదుట కవిత చేసిన చిట్‌చాట్‌తో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సన్నద్ధత అంశాలు చర్చకు రానున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. మరోవైపు మామఅల్లుడి వరుస భేటీలో పార్టీలో హట్‌ టాపిక్‌గా మారాయి.

Next Story