- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
by Gantepaka Srikanth |
జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ పదవీ కాలాన్ని తెలంగాణ ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ పదవీ కాలాన్ని తెలంగాణ ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్ర ఘోస్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ తన విచారణను పూర్తిచేసి ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉండగా ఇంకా పలువురిని విచారించాల్సి ఉండడంతో తాజాగా కమిషన్ గడువును మే 31 వరకు పొడిగించారు.
Next Story






