నేడు కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం.. హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-07 04:17:46  IST  )

కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) 23వ స్నాతకోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించబోతున్నట్లుగా వైస్ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కర్నాటి ప్రతాప్‌ రెడ్డి (Karnati Prathap Reddy) తెలిపారు.

నేడు కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం.. హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
X

దిశ, వెబ్‌డెస్క్: కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) 23వ స్నాతకోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించబోతున్నట్లుగా వైస్ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కర్నాటి ప్రతాప్‌ రెడ్డి (Karnati Prathap Reddy) తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ర్ట గవర్నర్‌, విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌ జిష్ణుదేవ్‌ వర్మ (Jishnu Dev Varma), శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు గ్రహీత, ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.శ్రీనివాస్‌ రెడ్డి (D Srinivas Reddy) హాజరవుతారని పేర్కొన్నారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే స్నాతకోత్సవంలో ఆర్ట్స్ ఫాకల్టీలో 60 గోల్డ్ మెడల్స్, 56 పీహెచ్‌డీలు, సైన్స్ ఫాకల్టీలో 161 గోల్డ్ ​మెడల్స్, 96 పీహెచ్‌డీలు, ఫార్మసీ ఫాకల్టీలో 48 గోల్డ్ మెడల్స్, 21 పీహెచ్‌డీలు, కామర్స్​ అండ్‌ బిజినెస్ మేనేజ్‌మెంట్‌ ఫాకల్టీలో 66 గోల్డ్​‍ మెడల్‌ లు, 49 పీహెచ్‌డీలు, సోషల్‌ సైన్సెస్ ఫాకల్టీలో 88 గో​‍ల్డ్ మెడల్స్, 133 పీహెచ్‌డీలు, ఎడ్యుకేషన్‌ ఫాకల్టీలో 25 గోల్డ్ మెడల్స్, 18 పీహెచ్‌డీలు, లా ఫాకల్టీలో 72 గోల్డ్ మెడల్స్, 4 పీహెచ్‌డీలు, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఫాకల్టీలో 44 గోల్డ్ మెడల్స్, 10 పీహెచ్‌డీలు, ఇలా మొత్తం 564 గోల్డ్ మెడల్స్, 387 పీహెచ్‌డీలను కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రదానం చేయనున్నారు.

Next Story