- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం.. ఇది ముగింపు కాదన్న గవర్నర్
కాకతీయ విశ్వవిద్యాలయం 23వ స్నాతకోత్సవం సోమవారం హనుమకొండలో వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్,

దిశ, హనుమకొండ: కాకతీయ విశ్వవిద్యాలయం 23వ స్నాతకోత్సవం సోమవారం హనుమకొండలో వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ , కాకతీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రుల్ని అభినందించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ‘‘స్నాతకోత్సవం అనేది ముగింపు కాదు, జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం’’ అని పేర్కొన్నారు. భారత పూర్వ రాష్ట్రపతి ఏ.పి.జే. అబ్దుల్ కలం చెప్పిన మాటలను స్మరించుచేసారు. ఉత్తర తెలంగాణాలో కాకతీయ విశ్వవిద్యాలయం ఒక మహత్తర విద్యా కేంద్రంగా ఎదుగుతోందని, న్యాక్ ఏ+ గ్రేడ్, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో 151–200 బ్యాండ్, యూఐ గ్రీన్ మెట్రిక్‌లో మూడో స్థానం, ఫార్మసీ కళాశాలకు 84వ ర్యాంకు లభించడం విశేష విజయాలని తెలిపారు.
ఈ విజయాల వెనుక ఉన్నతస్థాయి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల కృషి ఉందన్నారు. జాతీయ విద్యా విధానం 2020ను అనుసరిస్తూ విశ్వవిద్యాలయంలో కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, న్యూట్రిషన్ సైన్స్ వంటి కొత్త కోర్సులు ప్రారంభించడం అభినందనీయం అని అన్నారు. విద్యార్థులు జీవితంలో కూడా సేవ చేసే మనోభావంతో ముందుకెళ్లాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
డా. డి. శ్రీనివాస రెడ్డి ప్రేరణాత్మక ప్రసంగం
శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహిత, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డా. డి. శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామీణ నేపథ్యం లేదా తెలుగు మాధ్యమం విజయానికి అడ్డంకి కాదని స్పష్టం చేస్తూ, తమ విజయానికి కారణమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మిత్రులకు విద్యార్థులు కృతజ్ఞతగా ఉండాలని సూచించారు.
కేవలం జ్ఞానం ఉండటం సరిపోదని, దానిని ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలన్నారు. తక్కువ ఖర్చుతో మందుల తయారీ, దేశీయ టీకా అభివృద్ధి, పర్యావరణ హిత న్యాప్కిన్లు తయారీ, వ్యర్థాల నిర్వహణలో ఐసీటీ చేసిన కృషిని వివరించారు. "మంచి వ్యక్తిగా ఎదగాలంటే వినయం ఉండాలి, మూలాలను మరవకూడదు" అని హితవు పలికారు.
విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రసంగం
వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, గోల్డెన్ జుబిలీ సంవత్సరం సందర్భంగా స్నాతకోత్సవం జరగడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.144 కోట్ల బ్లాక్ గ్రాంట్, రూ.50 కోట్ల అదనపు గ్రాంట్‌తో మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందన్నారు. విశ్వవిద్యాలయం డ్రగ్ ఫ్రీ క్యాంపస్‌గా రూపుదిద్దుకుంటోందని, సైబర్ సేఫ్టీ, యాంటీ ర్యాగింగ్, రక్తదాన శిబిరాలు, వన మహోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పారా ఒలింపిక్ పతక విజేత విద్యార్థిని సఫలతను, ఫార్మసీ, పొలిటికల్ సైన్స్ విభాగాల అలుమ్ని కృషిని కొనియాడారు.
పట్టాలు, గోల్డ్ మెడల్స్ పంపిణీ
ఈ కార్యక్రమంలో మొత్తం 446 గోల్డ్ మెడల్స్, 374 మంది పీహెచ్డీ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. పాలక మండలి సభ్యులు, పూర్వ ఉపకులపతులు, డీన్‌లు, సెనేట్ సభ్యులు, అలుమ్ని, గోల్డ్ మెడల్ డోనర్లు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.






