చీము, నెత్తురు ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలి.. ఆ ఇద్దరిపై రెచ్చిపోయిన కడియం శ్రీహరి

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-08 07:57:40  IST  )

బీఆర్ఎస్(BRS) నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy), తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah)కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) సవాల్ చేశారు.

చీము, నెత్తురు ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలి.. ఆ ఇద్దరిపై రెచ్చిపోయిన కడియం శ్రీహరి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy), తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah)కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) సవాల్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్లా, రాజయ్య ఇద్దరూ దేవనూరుగుట్టలను సందర్శించాలని సూచించారు. తనపై చేసిన కబ్జా ఆరోపణలను క్షేత్రస్థాయిలో పర్యటించి నిరూపించాలని అన్నారు. నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీకు గులాంగిరీ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరూపించకపోతే మీ ఇద్దరు కలిసి నాకు గులాంగిరీ చేయాలని సవాల్ చేశారు.

మీకు చీము, నెత్తరు ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో నాకంటే పెద్ద లీడర్ ఎవడూ లేడు. అందుకే ప్రతీసారి నన్ను టార్గెట్ చేస్తున్నారని కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పద్నాలుగు సంవత్సరాలు మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశా, రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశా.. అందుకే చెబుతున్నా.. ఈ జిల్లాలో నేనే టాల్ లీడర్‌ను. అందుకే నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు అని కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story