Kadiyam : కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై కడియం ఫైర్

by Y. Venkata Narasimha Reddy |

తెలంగాణ ప్రభుత్వం కేంద్రం(Central Government) ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క రూపాయి ఇవ్వదని..దావోస్ పెట్టుబడులు మోసమంటూ కేంద్ర మంత్రులు బండి సంజయ్(Bandi Sanjay), కిషన్ రెడ్డి(Kishan Reddy)లు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari)మండిపడ్డారు. జ

Kadiyam : కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై కడియం ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కేంద్రం(Central Government) ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క రూపాయి ఇవ్వదని..దావోస్ పెట్టుబడులు మోసమంటూ కేంద్ర మంత్రులు బండి సంజయ్(Bandi Sanjay), కిషన్ రెడ్డి(Kishan Reddy)లు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari)మండిపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా కడియం శ్రీహరి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

భారత దేశం రాష్ట్రాల సమాఖ్య(India is a federation of states)అని, మన రాజ్యాంగం ఫెడరల్ వ్యవస్థను నిర్మాణం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఫెడరల్ సెటప్.. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం అని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు, విధులు, పన్నులను స్పష్టంగా పేర్కొనడం జరిగిందని..రాష్ట్రాలు సమీకరించే ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాల మధ్య తిరిగి ఖర్చు చేస్తుందన్న సంగతి మరిచి బండి సంజయ్ మాట్లాడం సరికాదన్నారు.

అలాగే దావోస్ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి బృందం రాష్ట్రానికి లక్ష 78 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తే.. సంతోషించవలసిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని కడియం తప్పుబట్టారు.

Next Story