షర్మిలపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   (  Updated:2023-02-07 08:44:56  IST  )

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు.

షర్మిలపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. బడ్డెట్ పై షర్మిల మాట్లాడటం బాధాకరమన్నారు. వైఎస్ కుటుంబం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమే అన్నారు. సమైక్యాంధ్ర నినాదంతో ఉరూరా తిరిగిన వ్యక్తి షర్మిల అని ఎద్దేవా చేశారు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. షర్మిలను జగన్ రాజకీయంగా అన్యాయం చేశారన్నారు. షర్మిల.. ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలకు మొర పెట్టుకోవాలని సూచించారు. రేపోమాపో జగన్ జైలుకు పోతే నీకు అవకాశం వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తిరిగి నీ సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు.

Next Story