కేసీఆర్ వల్లే ఆ పార్టీ నుండి బయటకు వెళ్లిపోతున్నారు.. కడియం సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-01 10:46:52  IST  )

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లాను కేసీఆర్ ఆరు ముక్కలు చేశారని అన్నారు. జిల్లాను ముక్కులు చేయవద్దని తాను బతిమాలానని కానీ ఆరు ముక్కలు

కేసీఆర్ వల్లే ఆ పార్టీ నుండి బయటకు వెళ్లిపోతున్నారు.. కడియం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లాను కేసీఆర్ ఆరు ముక్కలు చేశారని అన్నారు. జిల్లాను ముక్కులు చేయవద్దని తాను బతిమాలానని కానీ ఆరు ముక్కలు చేసి జిల్లాను ఆగమాగం చేశారని మండిపడ్డారు. పైకి వరగంల్ జిల్లా అని చెప్పుకోవడం మిగిలింది తప్ప మరేం లేదని అన్నారు. కేసీఆర్ ఆనాడు 36 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుండి చేర్చుకున్నారని విమర్శించారు. ఎవరూ రాజీనామా చేయకపోయినా మంత్రి పదవులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. మీరు చేస్తే రాజకీయం.. వేరేవాళ్లు చేస్తే వ్యభిచారమా? అంటూ ప్ర‌శ్నించారు. కేసీఆర్ నేర్పిన విద్యే క‌దా అంటూ నిల‌దీశారు. ఆయ‌న వ్య‌వ‌హారం న‌చ్చ‌క‌నే నాయ‌క‌త్వం నుండి బ‌య‌ట‌కు వ‌స్తున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ అహంకారం న‌చ్చ‌క‌నే దూరంగా ఉంటున్నార‌ని చెప్పారు. క‌డియం చేసిన కామెంట్స్ ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

కడియం కామెంట్స్‌కు కారణం అదేనా?

ఇక గ‌తంలో క‌డియం శ్రీహ‌రి బీఆర్ఎస్ లోనే ఉన్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా డిప్యూటీ సీఎం లాంటి కీల‌క ప‌ద‌విని బీఆర్ఎస్ క‌ట్ట‌బెట్టింది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిన త‌ర‌వాత క‌డియం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న కుమార్తె క‌డియం కావ్య‌కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆ పార్టీ నుండి కావ్య పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే పార్టీ మారిన త‌ర‌వాత క‌డియం శ్రీహ‌రి కేసీఆర్ పై ఈ స్థాయిలో ఎప్పుడూ రెచ్చిపోలేదు. కానీ క‌డియం పార్టీ మారిన త‌ర‌వాత జిల్లాలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా బీఆర్ఎస్ ప్లెక్సీల‌ను ఏర్పాటు చేయ‌డం, ఆయ‌న‌పై బీఆర్ఎస్ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేయ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ అధినేత‌పై నిప్పులు చెరిగారు.

‘కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం’.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

Next Story