నన్ను చంపాలని చూస్తే ముందు మీరే పోతారు: కేఏ పాల్

by Malleboina Mahesh |   (  Updated:2023-02-23 09:21:04  IST  )

నన్ను చంపాలని చూస్తే నా చావు కంటే ముందే కేసీఆర్, కేటీఆర్ చనిపోతారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నన్ను చంపాలని చూస్తే ముందు మీరే పోతారు: కేఏ పాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నన్ను చంపాలని చూస్తే నా చావు కంటే ముందే కేసీఆర్, కేటీఆర్ చనిపోతారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను చంపాలని చూశారని ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని అన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన తనకు చావంటే భయం లేదని, తన బౌన్సర్లకు కూడా ఇటీవలే తొలగించానని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి చేసిన తప్పే ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికానే గడగడలాడించానని, సోనియా గాంధీ, అమెరికా కలిసి నన్ను ఆపలేకపోయారని ఐ డోంట్ కేర్ అన్నారు. అది తెలుగు వ్యక్తి సత్తా అని అన్నారు. రాజ్యన్న రాజ్యం పేరుతో షర్మిల వచ్చిందని ఏపీలో జగన్ రాజన్న రాజ్యం తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టుకు వెళ్తున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రదీప్, కళ్యాణ్ లను శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రదీప్ చట్ట ప్రకారం వెళ్తుంటే అతడిని అడ్డుకుంటారా దమ్ముంటే నన్ను అడ్డుకోవాలని ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలోని 70 మాస్టర్ ప్లాన్లపై ఉమ్మడిగా న్యాయపోరాటం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికైనా అవినీతికి ఆపుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల కోసం నేను గళం విప్పుతుంటే నా నోరు మూయించడానికి కేసీఆర్ తన సోదరుడి హత్య కేసులో నన్ను ఇరిరింతే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్, అమిత్ షాను కలవబోతున్నానని బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. బీజేపీతో మా మధ్య ఎలాంటి ఒప్పందం లేకపోయినా రాష్ట్రం ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర పెద్దలతో కలుస్తున్నాన్నారు.

Next Story