రేవంత్ రెడ్డికి అప్పులు ఎలా తీర్చాలో, అభివృద్ధి ఎలా చేయాలో చెప్పా కానీ: కేఏ పాల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-08 10:36:57  IST  )

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేేఏ పాల్ షాకింగ్ కామెంట్లు చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చేది అంతా దోచుకునేవాళ్లేనని ఆరోపించారు

రేవంత్ రెడ్డికి అప్పులు ఎలా తీర్చాలో, అభివృద్ధి ఎలా చేయాలో చెప్పా కానీ: కేఏ పాల్
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేేఏ పాల్ షాకింగ్ కామెంట్లు చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చేది అంతా దోచుకునేవాళ్లేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికై రెండేళ్లు అయిందన్నారు. సీఎం కాకముందే, అయిన తరవాత రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారన్నారు. ఏడెనిమిది సార్లు రేవంత్ రెడ్డిని కలిసి అప్పులు ఎలా తీర్చాలి, రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలి అనేదానిపై అనేక స‌ల‌హాలు ఇచ్చాన‌ని చెప్పారు. కానీ ఆయ‌న విన‌క‌పోగా వాటికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తున్నార‌న్నారు. కాబ‌ట్టి ఆయ‌న రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

రేవంత్ ఆరు గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా అమ‌లు చేయ‌లేద‌న్నారు. తులం బంగారం ఇస్తామ‌ని ఇవ్వ‌లేద‌న్నారు. 2ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌లేద‌ని అన్నారు. రుణ‌మాఫీ చేస్తాన‌ని చెప్పి చేయ‌లేద‌న్నారు. నిరుద్యోగుల‌కు 4,500 ఇస్తామ‌ని ఇవ్వ‌లేద‌న్నారు. అలా వంద‌కు పైగా వాగ్దానాలు ఇచ్చి మోసం చేశార‌న్నారు. హైద‌రాబాద్ లో రియ‌ల్ ఎస్టేట్ కూడా ప‌డిపోయింద‌ని విమ‌ర్శించారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, నన్ను కోసుకొని తిన్నండి అంటూ.. రెండు రోజులు సమ్మిట్‌కు 400 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమ్మిట్‌కు 200 దేశాల్లో ఒక్క ప్రెసిడెంట్ అయినా వస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. ఒక్క బిలియనీర్ అయిన వస్తున్నాడా? అని ప్ర‌శ్నించారు.

Next Story