రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరిగి వెళ్లే విమానం చెక్ చేయండి.. కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణంపై, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరిగి వెళ్లే విమానం చెక్ చేయండి.. కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణంపై, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మెస్సీని కలవడానికి రాహుల్ గాంధీ ఖరీదైన ప్రైవేట్ విమానంలో ప్రయాణించారని, ఆ ఖర్చుకు సంబంధించి అనుమానాలు ఉన్నాయని కేఏ పాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించిన సమ్మిట్ సందర్భంగా వేల కోట్ల రూపాయల నగదు వసూలు చేశారనే ఆరోపణలను బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని కేఏ పాల్ ప్రస్తావించారు. ఆ నగదులో భాగాన్ని రాహుల్ గాంధీకి ఇవ్వడానికే ఈ ప్రయాణమా? అనే సందేహాలను ఆయన లేవనెత్తారు. వ్యాపార వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం భారీ మొత్తంలో ‘వైట్ మనీ’ సేకరిస్తున్నారని కూడా ఆరోపించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన సమ్మిట్‌కు హాజరైన వారినుంచి ఎంత మొత్తం వసూలు చేశారో వెల్లడించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరిగి వెళ్లే విమాన ప్రయాణాన్ని సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలించాలని ఆయన కోరారు. కాగా, ఇవాళ ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ వీక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చిన విషయం తెలిసిందే. ట్వీట్ ఇదే..

Next Story