- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నా: కేఏ పాల్
సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డిపై ఓ స్టూడెంట్ దాడి చేసినట్టు వీడియో చూశానని అన్నారు. నిజంగా దాడి జరిగితే దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డిపై ఓ స్టూడెంట్ దాడి చేసినట్టు వీడియో చూశానని అన్నారు. నిజంగా దాడి జరిగితే దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కానీ ఇక్కడ ప్రజలు ఎందుకు రెచ్చిపోయి ఉన్నారనేది సమస్య అన్నారు. 60లక్షల మంది నిరుద్యోగులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనేది సమస్య అన్నారు. రూ.4వేల ఫించన్ ఇస్తానని ఇవ్వకపోవడం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం కోట్లు సంపాదించుకుంటున్నారు అనే ఆరోపణలు రావడం వల్లనే దాడి జరిగిందన్నారు.
తాను ఎంతో ప్రేమ, గౌరవంతో రేవంత్ రెడ్డిని 7సార్లు కలిశానని అన్నారు. గంటల కొద్దీ చర్చించామన్నారు. ట్రంప్ సంస్థ విలువనే 700కోట్లు అని వాళ్లు లక్ష కోట్లు ఎలా పెట్టుబడి పెడతారని ప్రశ్నించారు.2023-2024లోనే 600కోట్ల నష్టం జరిగితే ట్రంప్ మీడియా సంస్థను మూసివేయడానికి సిద్ధపడితో ఓ బిలియనీర్ కాపాడారని అన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని మాటిచ్చినవాళ్లు అంతా ఫెయిల్ అయిపోయారని అన్నారు. నిరుద్యోగులు ఎవ్వరినీ కొట్టవద్దని వాళ్లను పక్కన పెట్టాలన్నారు. నిరుద్యోగులు గ్రూపులు పెట్టాలని కలిసి ప్రచారం చేద్దామని పిలుపునిచ్చారు.






