ముగిసిన కళాతపస్వి కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు

by Disha Web Desk 13 |
ముగిసిన కళాతపస్వి కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీ దిగ్గజం కళాతపస్వి కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్టలోని శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుమందు ఫిలిం చాంబర్‌లో విశ్వనాథ్‌ పార్థీవదేహానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్‌నగర్‌ నుంచి పంజాగుట్ట వరకు అంతిమయాత్ర సాగింది.

ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బ్రహ్మాణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. లెజెండరీ డైరెక్టర్‌ కె. విశ్వనాథ్‌(92)మరణంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సినిమా స్థాయిని, గుర్తింపు ఉన్నత శిఖరాన ఉంచిన కళాతపస్వి ఇక లేరన్న వార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed