- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నేను పోటీ చేస్తున్నది రాజకీయ పదవికి కాదు’.. తెలుగు రాష్ట్రాల పార్టీలకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి రిక్వెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీ(Telugu Political Parties)లకు ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి(Justice Sudarshan Reddy) కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తెలుగు రాష్ట్రాల పార్టీలు పునరాలోచించుకోవాలి. తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడికి పోయింది?. తెలంగాణ అస్థిత్వం ఏమైపోయింది?. నేను పోటీ చేస్తున్నది రాజకీయ పదవికి కాదు.. రాజ్యాంగ పదవికి. ఏన్డీయే కూటమి అభ్యర్థికే తమ మద్దతు అని వైసీపీ స్పష్టంగా చెప్పింది. టీడీపీ, బీఆర్‌ఎస్ నుంచి స్పందన లేకపోవడం శోచనీయం’ అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇదిలా ఉంటే.. సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి అని.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కావడంతో మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్(BRS)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. కానీ, కేటీఆర్ దీనిని తిరస్కరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. దీంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.






