- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HCA పర్యవేక్షణకు జస్టిస్ నవీన్ రావు నియామకం
by Gantepaka Srikanth |
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) అవకతవకల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) అవకతవకల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. HCA పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావు(Justice Naveen Rao)ను హైకోర్టు నియామించింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు హెచ్‌సీఏలో అక్రమాలపై తెలంగాణ సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, ట్రెజరరి శ్రీనివాస్ రావు, కోశాధికారి సీజే శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్‌యాదవ్, క్లబ్ అధ్యక్షురాలైన కవితను అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. జగన్ మోహన్‌రావు అక్రమంగా ఎన్నికయ్యాడని సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది. హెచ్‌సీఏ నిధుల మళ్లింపుపైనా దర్యాప్తు కొనసాగుతోంది.
Next Story






