- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్..! సిఫార్సు చేసిన కొలీజియం
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (Aparesh Kumar Singh) పేరును సుప్రీం కోర్టు (Supreme Court) కొలీజియం సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (Aparesh Kumar Singh) పేరును సుప్రీం కోర్టు (Supreme Court) కొలీజియం సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతం అపరేశ్ కుమార్ సింగ్ త్రిపుర (Tripura) హైకోర్టు సీజేగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్ కుమార్ (T Vinod Kumar)ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా, సుప్రీం కోర్టు కొలీజియంతో పాటు చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయ్ (Chief Justice BR Gavai) నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు తిరిగి పంపాలని సిఫారసు చేశారు. అయితే, ఆ న్యాయమూర్తులు గతంలో ఇతర రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేయబడ్డారు. ఇక తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ జోయ్‌పాల్ (Joypal)ను కలకత్తా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేయాలని ప్రతిపాదించారు. దేశ వ్యాప్తంగా 21 హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ, తిరిగి వెనక్కి పంపడానికి సంబంధించి సిఫార్సులలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ సి.సుమలత (C Sumalatha), జస్టిస్ కన్నెగంటి లలిత (K Lalitha)ను తెలంగాణ హైకోర్టుకు తిరిగి పంపాలని అనుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి (Annireddy Abhishek Reddy)ని తెలంగాణ హైకోర్టుకు తిరిగి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.






