- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jurala Dam: హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి CM రేవంత్ శంకుస్థాపన
by Gantepaka Srikanth |
హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి CM రేవంత్ శంకుస్థాపన

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు(ఎం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రూ. 151.92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన వివరాలు :
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం.. ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు రూ.121.92 కోట్లతో శంకుస్థాపన.. ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన.. రూ.15 కోట్లతో అమరచింత మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
Next Story






