TG News : రేపటి నుంచి జూడాల సమ్మె.. చర్చలకు ఆహ్వానించిన మంత్రి

by Muthe.Rajitha |

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు(Junior Doctors) రేపు సమ్మె(Strike)కు దిగనున్న సంగతి తెలిసిందే.

TG News : రేపటి నుంచి జూడాల సమ్మె.. చర్చలకు ఆహ్వానించిన మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో జూనియర్ డాక్టర్లు(Junior Doctors) రేపు సమ్మె(Strike)కు దిగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో(Medical Colleges) సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని లేదంటే జూన్ 30 నుంచి ధర్నాకు దిగుతామని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Minister Damodara Rajanarasimha) రంగంలోకి దిగారు. జూడాలను చర్చలకు ఆహ్వానించారు.

దీంతో జూనియర్ డాక్టర్లు, సీనియర్ వైద్యులు సంగారెడ్డికి బయలుదేరి వెళ్లారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అంశంతోపాటు స్టైఫండ్(Stipend) ప్రతినెలా 10 లోగా ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒకవైపు జూడాలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం, అంతకముందే మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది.

Next Story