- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay : గారడీ గ్యారంటీలను తెలంగాణ ప్రశ్నిస్తుంది : బండి సంజయ్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)ఏడాది పాలన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాల(Prajapalana Vijayotsavalu)పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)మరోసారి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)ఏడాది పాలన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాల(Prajapalana Vijayotsavalu)పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)మరోసారి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. గారడీ గ్యారంటీలను, గాయబైన హామీలను, గాడితప్పిన పాలనను ప్రశ్నిస్తుంది తెలంగాణ సమాజమని ట్వీట్ చేశారు. నీడను కూలుస్తూ, నీచ రాజకీయాలు చేస్తూ, నియంత పాలన కొనసాగిస్తున్న నీతిలేని నాయకులను, నిజాం వారసుల దోస్తులను నిలదీస్తుంది తెలంగాణ అంటూ కాంగ్రెస్ పాలకులపై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆరు అబద్ధాలు..66మోసాల పేరుతో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ నెల 6న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.






