మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు షాక్.. విచారణకు రావాలని పోలీసుల నోటీసులు

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ నేత, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌(Gadari Kishore)కు పోలీసులు షాకిచ్చారు.

మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు షాక్.. విచారణకు రావాలని పోలీసుల నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌(Gadari Kishore)కు పోలీసులు షాకిచ్చారు. గతంలో కేటీఆర్‌పై ఏపీ ఎంపీ సీఎం రమేశ్(CM Ramesh) చేసిన ఆరోపణలను ఖండిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గాదరి కిషోర్‌పై కేసు నమోదు అయింది. దీంతో ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులు(Jubilee Hills Police) నోటీసులు ఇచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

‘‘ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ తోడకలు తీస్తాం కొడకా. సీఎం రమేష్ అనేటోడు ఒక బ్రోకర్ గాడు.. కేటీఆర్ గురించి మాట్లాడితే నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు నీ తోడ్కల్ తీస్తా.. చంద్రబాబు బూట్లు నాక్కుంట.. బీజేపీ అధికారంలోకి రాగానే నన్ను ఎక్కడ జైల్లో పెడతారో అని భయపడి మోడీ సంకల కూసున్న ఒక బ్రోకర్ గాడు కేటీఆర్ గురించి మాట్లాడుతున్నాడు’’ అంటూ సీఎం రమేశ్‌పై గాదరి కిషోర్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయిన విషయం తెలిసిందే.
గాదరి కిషోర్ ప్రసంగం వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story