- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Naveen Yadav : అసెంబ్లీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తొలి స్పీచ్ ఇదే..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (సోమవారం) ప్రారంభమయ్యాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (సోమవారం) ప్రారంభమయ్యాయి. ఇటీవల నిర్వహించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ .. తొలిసారి ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో తన మొదటి స్పీచ్‌లో ప్రజా సమస్యలపై మాట్లాడారు. ‘నాకు అవకాశం ఇచ్చి గెలిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. గత రెండు ఏళ్ల క్రితం అసెంబ్లీలో సీఎం తన పేరును ప్రస్తావించారు. రెండేళ్లలోపే తోటి సభ్యుడిగా సభలో రావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి సూచన సలహాలతో మా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు పోవడానికి కృషి చేస్తాను. ఈ సందర్భంగా సభ మర్యాదలను పాటిస్తూ సభను గౌరవిస్తూ ముందుకు సాగుతాను’ అని వ్యాఖ్యానించారు.
తన నియోజకవర్గ సమస్యల గురించి నవీన్ మాట్లాడుతూ.. వర్షంతో కృష్ణానగర్ మునిగిపోతుంది.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ లో హై టెన్షన్ లైన్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయని ఈ సమస్యలను పరిష్కరించాలని, తన ప్రాంతంలో ఇంటర్, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.






