Jubilee Hills: గెలుపు దిశగా కాంగ్రెస్.. గాంధీభవన్‌లో ‘రప్పా.. రప్పా’ ఫ్లెక్సీ తో సంబరాలు

by Prasad Jukanti |

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దిశగా దూసుకుపోతున్నారు.

Jubilee Hills:  గెలుపు దిశగా కాంగ్రెస్.. గాంధీభవన్‌లో ‘రప్పా.. రప్పా’ ఫ్లెక్సీ తో సంబరాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పార్టీలు చాలెంజింగ్‌గా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills Bypoll) అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతున్నది. దీంతో గాంధీభవన్‌లో సంబరాలు (Gandhi Bhavan celebrations) మొదలయ్యాయి. పెద్ద ఎత్తున గాంధీ‌భవన్ చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఫొటోలతో ఉన్న ‘రప్పా.. రప్పా’ ప్లెక్సీలు (Rappa Rappa Flexi) ప్రదర్శించారు. 2028లో కూడా 100కు తగ్గేదేలే.. అని పేర్కొన్నారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి నివాసంతో పాటు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Next Story