- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి ఎంపిక.. బీజేపీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థి ఎంపికలో తలమునకలై ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థి ఎంపికలో తలమునకలై ఉన్నాయి. అయితే, బీఆర్‌ఎస్ (BRS) పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత (Maganti Sunitha) బై పోల్ బరిలో నిలుస్తుందని ఇప్పటికే గులాబీ బాస్ ప్రకటించారు. ఇక అధికార కాంగ్రెస్ (Congress) పార్టీలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, దానం నాగేందర్, మైనంపల్లి హనుమంత రావు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అక్టోబర్ 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు.
మరోవైపు బీజేపీ (BJP) నుంచి పోటీలో నిలిచేందుకు లంకాల దీపక్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైన విషయం తెలిసిందే. అదేవిధంగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీ సుభాష్, మాధవీ లత టిక్కెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక్కడ అభ్యర్థి స్థానికత కీ ఫ్యాక్టర్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం నాయకులు, పార్టీ కేడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. అందులో మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.






