- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ బైపోల్.. నవీన్ యాదవ్ మద్దతు తెలిపిన యాక్టర్ సుమన్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో..జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (MLA Maganti Gopinath) అకాల మరణంతో..జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక (By-election) వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ప్రకటించింది. ఈ మేరకు నవీన్ యాదవ్.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను అధికారికంగా ఉప ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించడంతో.. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు.
ఇందులో భాగంగానే టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన సుమన్.. నవీన్ యాదవ్ (Naveen Yadav) కి తన మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం (Jubilee Hills Constituency) ఉప ఎన్నికల్లో నవీన్ కి మద్దతు ఇవ్వాలని, నవీన్ యాదవ్ మంచి యువకుడని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తాడని, ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రజలు ఆయనతో నిలబడాలని, ఈ ఉప ఎన్నికల్లో తన సపోర్ట్ నవీన్ యాదవ్ కు ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా యాక్టర్ సుమన్ చెప్పుకొచ్చారు.






