జూబ్లీహిల్స్ బై పోల్ సర్వేల్లో స్పష్టత లేదు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికర కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-06 07:21:27  IST  )

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక ప్రచారం చరమాంకానికి చేరుతున్నా.. సర్వేల్లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంలో అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు.

జూబ్లీహిల్స్ బై పోల్ సర్వేల్లో స్పష్టత లేదు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక ప్రచారం చరమాంకానికి చేరుతున్నా.. సర్వేల్లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంలో అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ (Congress) పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. గ్రామ స్థాయిలో ఉండే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో లేదని కామెంట్ చేశారు. ఓటర్లలో ఏ పార్టీకి ఓటు వేయాలో ఇంకా స్పష్టత లేదని.. అందుకు సర్వేల్లో కూడా ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

కనీసం వీధి లైట్లకు సైతం జీహెచ్ఎంసీ (GHMC)లో డబ్బులు లేని పరిస్థితి ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు మాట్లాడటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈనాడు జూబ్లీహిల్స్ వెనుకబాటుకు బీఆర్ఎస్ పార్టీ కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక గ్యారంటీ హామీల గురించి కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంలో మెజారిటీ వాటా కేంద్రానిదేనని అన్నారు. ఆ పథకాన్ని ఆపుతామంటూ రేవంత్ ఎలా అంటాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఫ్రీ బస్సు గురించి మాట్లాడుతున్నారని.. అన్ని సమస్యలకు ఆ పథకమే పరిష్కారం అన్నట్టుగా వ్యవహరించడం వారి మూర్ఖత్వమని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Next Story