జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి BIG అప్డేట్

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై ఎన్నికల సంఘం(Election Commission) అధికారులు దూకుడు పెంచారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి BIG అప్డేట్
X

Jubilee Hillsజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై ఎన్నికల సంఘం(Election Commission) అధికారులు దూకుడు పెంచారు. మంగళవారం నియోజకవర్గ తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణణ్ మీడియాతో మాట్లాడారు. తుది జాబితా ప్రకారం జూబ్లీ‌హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 ఉన్నారు. ఇందులో పురుషులు 2,07,367, మహిళలు 1,91,590, ఇతరులు 25 ఉన్నారు. కాగా, మరోవైపు జూబ్లీహిల్స్‌ ఎన్నికకు కేంద్ర పరిశీలకులను నియమిస్తున్నట్లు ఈసీ ఆదివారం ప్రకటించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకే పరిశీలకులను నియమిస్తున్నట్లు వెల్లడించింది. వీరు ప్రధానంగా అభ్యర్థులు చేసే ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక నిఘా పెడతారు.

Next Story