- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. CPM మద్దతు కోరిన టీపీసీసీ చీఫ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఓవైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుంగానే.. మరోవైపు మిత్ర పక్షాల మద్దతుకు కాంగ్రెస్ చర్చలు ప్రారంభించింది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఓవైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుంగానే.. మరోవైపు మిత్ర పక్షాల మద్దతుకు కాంగ్రెస్ చర్చలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్‌లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌కుమార్ యాదవ్‌కు మద్దతివ్వాలని, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వంతో కలిసి రావాలని ఆయనను మహేశ్‌కుమార్ గౌడ్ కోరారు. అందుకు జాన్ వెస్లీ స్పందిస్తూ.. పార్టీ నగర కమిటీతో చర్చలు జరుపుతున్నామని.. ఈనెల 20న జరిగే తమ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో మద్దుతుపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించాలని టీపీసీసీ చీఫ్‌కు జాన్ వెస్లీ సూచించగా.. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు.






