- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills By-Election: కాంగ్రెస్ వ్యూహం ఇదే!
జూబ్లీహిల్స్ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్మైనార్టీ ముఖ్య నేతలతో టీపీసీసీ చీఫ్మహేష్కుమార్గౌడ్కీలక సమావేశం నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్మైనార్టీ ముఖ్య నేతలతో టీపీసీసీ చీఫ్మహేష్కుమార్గౌడ్కీలక సమావేశం నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగిన ఈ సమావేశానికి జూబ్లీహిల్స్ ఇంచార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్‌లు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అనుసరించాల్సిన వ్యూహలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్మహేష్కుమార్గౌడ్మాట్లాడారు.
జూబ్లీహిల్స్ఉపఎన్నికలో పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ ఓటర్లున్నందున పార్టీ నేతలు వారి దగ్గరకు వెళ్లి పార్టీ అభ్యర్థి తరుఫున ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రచారంలో పేర్కొనాలని ఆయన వివరించినట్లుగా తెలిసింది. నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని మహేష్‌కుమార్‌గౌడ్ చెప్పినట్లుగా పార్టీ నేతలు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న నేతలు ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు అభిప్రాయాలను, సూచనలు చేసినట్లుగా సమాచారం.






