- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills By-Election: ‘నవీన్ అన్న బెస్ట్ లీడర్’.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మద్దతు
తెలంగాణ రాజకీయం అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) చుట్టూ తిరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయం అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) చుట్టూ తిరుగుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. ఉప ఎన్నిక ఛాలెంజ్‍గా మారిన నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సై అంటే సై అనేలా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి, అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్(Naveen Yadav)కు టాలీవుడ్ సింగర్, ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) మద్దతు ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘నవీన్ యాదవ్ చాలా మంచోడు. ఇంజినీరింగ్ చేసిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదు. అలాంటిది కఠినమని తెలిసి కూడా నవీన్ అన్న పాలిటిక్స్‌లోకి వచ్చాడు. ఆయన్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తాడు. ఉన్న క్యాండిడేట్స్‌లో ఆయనే బెస్ట్ లీడర్’ అని రాహుల్ సిప్లిగంజ్ మద్దతు ఇచ్చారు. వీడియో






