జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ షురూ.. 800 మంది కేంద్ర బలగాలతో భద్రత కట్టదిట్టం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-11 04:31:20  IST  )

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ సరిగ్గా ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ షురూ.. 800 మంది కేంద్ర బలగాలతో భద్రత కట్టదిట్టం
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ సరిగ్గా ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. అందుకు ముందు ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల్లో అన్ని పార్టీల ఏజెంట్ల ఎదుట మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లకు సీల్ వేసి ప్రధాన పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల తరఫున నవీన్‌ యాదవ్‌ (Congress), సునీత (BRS), లంకల దీపక్‌రెడ్డి (BJP) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల పనుల్లో 5 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్‌ సజావుగా సాగేందుకు 1,761 మంది పోలీసులు, అదనంగా 800 మంది కేంద్ర బలగాలు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈసారి తొలిసారిగా డ్రోన్ల ద్వారా ఎన్నికల పర్యవేక్షణ చేపట్టారు. మొత్తం 139 ప్రాంతాల్లో 139 డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేస్తుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం పోలింగ్‌ మందకొడిగా సాగుతుండగా.. ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే ఈసీ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల అధికారులు ప్రజలను సాయంత్రం 6 గంటలలోపు తప్పనిసరిగా ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడలోని నవోదయ కాలనీలో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

READ MORE ....

Jubilee hills bypoll: జూబ్లీహిల్స్ బై పోల్.. ఓటు హక్కు వినియోగించుకున్న నవీన్ యాదవ్

Next Story